- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: పాలిటిక్స్‌లోకి వారుసుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: తన రాజకీయ జీవితంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. తాను పార్టీలో కొనసాగుతానని.. ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. తన కుమారుడిని ఆశీర్వదించాలని చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో జరిగిన సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలను కోరారు. అటు మోహిత్ రెడ్డి కూడా కొంతకాలంగా పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి హాజరువుతూ వస్తున్నారు. గడప గడపకు కార్యక్రమంలో కూడా ప్రజలను కలిసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే తన రాజకీయ వారుసుడిగా మోహిత్ రెడ్డిని చెవిరెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ టీమ్‌లోకి తన కుమారుడు వెళ్తున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ధర్మాన వారసుడు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కొందరు యువకులు కూడా జగన్ టీమ్‌లోకి వెళ్లబోతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.