- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:‘చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి,తిరుపతి: సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకుల పై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని దుయ్యబట్టారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని రోజా విమర్శించారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని ఫైరయ్యారు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని పేర్కొన్నారు. జూలై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కి పంపాం అంటూ ఈవో స్టేట్‌మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వం పై నింద వేశారు. ఈ క్రమంలో మళ్లీ శ్యామలరావు పై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారని ధ్వజమెత్తారు.