Tirumala: ఒకటో తేదీనే ప్రకటించండి.. శ్రీవాణి ట్రస్టు విరాళాలపై బీజేపీ సంచలన డిమాండ్

by srinivas |
Tirumala: ఒకటో తేదీనే ప్రకటించండి.. శ్రీవాణి ట్రస్టు విరాళాలపై బీజేపీ సంచలన డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్టులో అవకతవకలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలపై టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టుపై అవగాహన లేకే కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అది సరికాదని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆరోపణలు చేయడం సహజంగా మారడం దురదృష్టకరమన్నారు.


గతంలో కూడా పింక్ డైమండ్, నేలమాళిగలు అంటూ దుష్ప్రచారం చేశారని ..అవన్నీ తప్పుడు ఆరోపణలేనని తాను ఖండించినట్లు భాను ప్రకాశ్ రెడ్డి గుర్తు చేశారు. భక్తుల్లో నెలకొన్న అనుమానాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుకు ఎన్ని విరాళాలు వస్తున్నాయో ప్రతి నెల ఒకటో తేదీన టీటీడీ ప్రకటించాలని భాను ప్రకాశ్ రెడ్డి సూచించారు. పింక్ డైమండ్‌పై పరువునష్టం దావా కేసులో రూ.2 కోట్ల భక్తుల డబ్బును కోర్టుకు చెల్లించినట్లు చెప్పారు. ఆ సొమ్మును టీటీడీ పాలకమండలి, అధికారులు వడ్డీతో సహా చెల్లించాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed