ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా పూతలపట్టు ప్రభాకర్ నియామకం

by Jakkula Mamatha |   ( Updated:2024-03-06 13:44:24.0  )
ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా  పూతలపట్టు ప్రభాకర్ నియామకం
X

దిశ ప్రతినిధి, తిరుపతి:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ వైయస్ షర్మిల రెడ్డి ఏఐసీసీ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఇన్చార్జి మాణిక్య ఠాగూర్ ఏఐసీసీ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా మన ప్రాంతానికి చెందిన పూతలపట్టు ప్రభాకర్ ని నియమించడం జరిగింది. ఈ పదవి రావడానికి నా కాంగ్రెస్ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాంగ్రెస్ పార్టీని గడపగడపకు తీసుకుపోతూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి పూర్వ నాయకులను నేటి యువతరాన్ని ఆహ్వానిస్తూ కష్టపడుతున్నందుకు ఈరోజు పూతలపట్టు ప్రభాకర్ ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ అధికార ప్రతినిధిగా నిర్మించడం ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు.

పూతలపట్టు ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పెద్దలు శ్రీ జంగా గౌతం, డాక్టర్ చింతామోహన్ గారు, శ్రీ పోటుగాడు భాస్కర్, శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు మిగిలిన పెద్దలందరూ కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతను ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలకన్నా నాకు ఇచ్చిన బాధ్యతలను నేను శిరసవంచి కాంగ్రెస్ సిద్ధాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఈ దేశానికి తీసుకుని వచ్చిన రాజ్యాంగాన్ని, గొప్ప పరిపాలన విధానాన్ని కాంగ్రెస్ విద్య వైద్య రంగాల్లో తీసుకున్న గొప్ప సంస్కరణలు పేదరికం నిర్మూలన కోసం తీసుకొని వచ్చినటువంటి అనేక పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రతి ఇంటికి సౌభాగ్యం అన్నారు. దానికి నా వంతు కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సమస్యల పైన పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

Read More..

వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. త్వరలో జనసేనలోకి!

Advertisement

Next Story