- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడిని ‘చావు’ దెబ్బకొట్టిన సెల్ ఫోన్
దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలం తర్వాత ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వినియోగించడం పరిపాటి అయిపోయింది. కరోనా కాలంలో కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత మానసిక ప్రవర్తనల్లో రకరకాల తేడాలు కనిపిస్తున్నాయి. బాలబాలికలు, యువకులు, విద్యార్థులు, మధ్య వయసు వాళ్లు, పెద్దలు కూడా సెల్ ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
దీంతో బాలబాలికలు, యువకులు మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. తద్వారా ఏకాగ్రత, చదువు, సంస్కారం, వ్యక్తిత్వం వంటివి మర్చిపోతున్నారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువకులు వినోదం మాటున అశ్లీల, హింసాత్మక దృశ్యాలు చూసి తప్పుదారి పడుతున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, యువకుల్లో దూకుడు, అవాంఛనీయ నిర్ణయాలు, అసంకల్పిత ఆలోచనలు పెరిగిపోతున్నాయి. వారిలో ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, చికాకు వంటివి మితిమిరిపోతున్నాయి. ఇలా విచక్షణ కోల్పోయి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కొన్ని సమయాల్లో వాళ్లకు వాళ్లే శిక్షలు వేసుకుని ఆస్పత్రి పాలవుతున్నారు. మరికొన్ని సమయాల్లో బలవంతంగా తనువు చాలిస్తున్నారు.
ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పుంగనూరు(Punganur)కు చెందిన యువకుడికి సెల్ ఫోన్(Cell Phone) చూసే అలవాటు విపరీతంగా పెరిగింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు సెల్ ఫోన్ చూడొద్దని గతంలో చాలు చెప్పారు. అయినా యువకుడు మానుకోలేదు. మరింత సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. సెల్ ఫోన్ చూడొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక కోనేరులో దూకి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. స్థానికులు గమనించి యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ యువకుడు నీటిలో మునిగిపోనిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి యువకుడి మృతి దేహాన్ని వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ ఇవ్వడం మానుకోవాలని, ఆ పని తల్లిదండ్రులే చేయాలని పోలీసులు సూచించారు.