- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Traffic Rules:ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన 110 వాహనాలు సీజ్
దిశ ప్రతినిధి, చిత్తూరు:జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్, వాహనానికి సంబంధించి సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తింపు కొరకు శనివారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 110 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సరైన పత్రాలు చూపించి మరియు నెంబర్ ప్లేట్ వేయించుకున్న వాహనాలను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోడ్డు భద్రతా అవగాహన పై ప్రత్యేక దృష్టి సారించడం అనివార్యమని అన్నారు. ప్రతి వాహనానికి సరైన నెంబర్ ప్లేట్, సక్రమమైన వాహన పత్రాలు ఉండటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వాహన నియమాలు పాటించని పక్షంల, వారి వాహనాలు స్వాధీనం చేసుకోవడం లేదా వారికి చట్టపరమైన శిక్షలు విధించడం జరుగుతుందన్నారు.