- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహానటి సావిత్రి కోసం ఆ పని చేసిన చిరంజీవి.. మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉండదామరీ..!
దిశ వెబ్ డెస్క్: మహానటి సావిత్రి, ఈ పేరుగురించి పరిచయం అవసరం లేదు. నాటి నేటికీ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనేలా ఆమె ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు. బౌతికంగా ఆమె మనకి దూరమైన ఆమె నటించిన చిత్రాలు నేటికీ మనల్ని అలరిస్తూనే ఉన్నాయి. నటనలోనే కాదు మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆమెకు ఆమె సాటి.
అతి చిన్న వయసులోనే అత్యంత కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న ఆమె, అంతే తొందరగా అధఃపాతాళానికి పడిపోయారు. అంతా తనవాళ్ళే అనుకుని చివరి ఒంటరిగా మిగిలిపోయారు. కట్టుకున్న భర్తే మోసం చేయగా సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకుని నిరుపేదగా కన్నుమూశారు. ఇక ఆ మహానటి గురించి గతంలో సావిత్రి గారి జీవిత కథగా మహానటి సావిత్రి అనే ఓ బుక్ రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే.
అయితే తాజాగా మహానటి సావిత్రి గురించిన మరో పుస్తకం సావిత్రి క్లాసిక్స్ కూడా విడుదలైంది. నిన్న రాత్రి హైదరాబాద్ లోని N కనెన్షన్ లో సంజయ్ కిషోర్ రాసిన సావిత్రి క్లాసిక్స్ అనే బుక్ మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆమెతో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను సావిత్రితో కలిసి పునాది రాళ్లు, ప్రేమ తరంగాలు అనే రెండు సినిమాల్లో నటించినట్లు తెలిపారు.
ఇక పునాది రాళ్లు సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో తనని ఆమెకు పరిచయం చేసారని పేర్కొన్నారు. అయితే అనుకోకుండా ఓ రోజు సినిమా షూటింగ్ మధ్యలో వర్షం పడి షూటింగ్ ఆగిపోయిందని.. ఆ సమయంలో తనని డాన్స్ చేయమని సావిత్రి కోరినట్లు తెలిపారు. ఇక సావిత్రి అడిగిన వెంటనే తన దగ్గర ఉన్న టేప్ రికార్డర్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ సాంగ్స్ కి డ్యాన్స్ వేసినట్లు పేర్కొన్నారు.
అయితే అలా డాన్స్ చేస్తున్న సమయంలో తాను కింద పడిపోయానని.. అయితే కిందపడిన విషయాన్ని కవర్ చేయడానికి నేలపైన పడుకుని డాన్స్ చేశానని వెల్లడించారు. ఇక అది చూసి సావిత్రమ్మ అభినందించి మంచి నటుడివి అవుతావు అని అన్నారని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, మురళీమోహన్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.