సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ సీఎం జగన్.. చీరాల ఎమ్మెల్యే కరణం

by Javid Pasha |
సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ సీఎం జగన్.. చీరాల ఎమ్మెల్యే కరణం
X

దిశ, చీరాల : గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ముఖ్యమంత్రి జగన్ నిలిచారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ చీరాల ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్ర మంలో ముఖ్య అతిధిగా చీరాల శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే బలరామ్ మాట్లాడుతూ.. తోటవారిపాలెం సచివాలయం 1 పరిధిలో 10,551 సర్వీసుల ను ప్రజలకు ఉచితంగా అందించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవటం ఆనందంగా ఉంద న్నారు.

సచివాలయం 2 పరిధి లో 5536 సర్వీసులు, గ్రామ ప్రజలకు ఉచితంగా అందించ డం జరిగిందన్నారు. అలానే తోటవారిపాలెం గ్రామ పంచా యితీ పరిధిలో, 2019 నుండి ఇప్పటి వరకు, 2 కోట్ల 85 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, పబ్లిక్ టాయిలెట్స్,రైతు భరోసా కేంద్రం, గ్రామ ఆరోగ్య కేంద్రం, గ్రావెల్ రోడ్లు, గ్రామ సచివాలయాలు, మంచినీటి పైప్ లైన్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను చేయగలగటం సంతృప్తి గా ఉందని, భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతా మన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందన్నారు.

పేదల పక్షపాతి అయిన జగ నన్న ఆశయాలకు అనుగుణంగా జగన్ అన్న సహకారంతో, చీరాల లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్య క్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరె క్టర్ గవిని శ్రీనివాసరావు, ఆర్ బి కె చైర్మన్ కావూరి రమణా రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ నేతాజీ, తహసీల్దార్ ప్రభాకరరావు, ఈఓఆర్డీ బాపూజీ, హౌసింగ్ ఏ.ఇ. శ్రీనివాసులు, ఏపీఎం సుబ్బారావు, నాదెండ్ల కోటే శ్వరరావు, పర్వతనేని శ్రీనివా సరావు,గొలకారం సాంబశివరా వు, డేగల వెంకటేశ్వర్లు, చిన్నం చిట్టిబాబు, గుమ్మడి చిన్నబా బు, కొండవీటి శ్రీనివాసరావు, అందే సాంబశివరావు, గడ్డం సిద్దు, గండూరీ వెంకట్రావు, బుర్ల సాంబశివరావు, బుర్ల మురళి, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, సచివా లయ కన్వీనర్లు, జేసీఎస్ మం డల కన్వీనర్లు, వార్డు వాలంటీ ర్లు, గృహసారధులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story