AP:‘మీ భూములను ఓ సారి చెక్ చేసుకోండి’..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

by Jakkula Mamatha |   ( Updated:2024-07-16 11:38:16.0  )
AP:‘మీ భూములను ఓ సారి చెక్ చేసుకోండి’..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో నేడు (మంగళవారం) జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం సంతకాలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ తమ భూములను ఒకసారి చెక్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. గుజరాత్‌లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తాం అన్నారు. దాని ప్రకారం తామే భూయజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలన్నారు. భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Advertisement

Next Story