- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు శక్తి, సామర్థ్యాలు వెలకట్టలేనివి.. ఏపీలో అరాచక పాలన : పవన్ కల్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో : నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని పవన్ కల్యాన్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును రిమాండ్‌కు తరలించడం బాధాకరమన్నారు. ఇందులో భాగంగా తన సానుభూతి తెలియజేసేందుకే తాను చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు, తనకు రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బాగుండాలన్నదే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని స్థాపించింది కూడా రాష్ట్ర భవిష్యత్ కోసమేనని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేకపోయిందని అన్నారు. అందులో భాగంగానే సగటు మనిషిగా తాను జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆ సభలో తన ఆవేదనను వెళ్లగక్కినట్లు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అయితే రాష్ట్ర భవిష్యత్ కోసం నాడు నరేంద్రమోడీకి సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలిపారు. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ముఖ్య ఉద్దేశంతో తాను మోడీకి మద్దతుగా నిలిచినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ముంబైలో ఉగ్రదాడి, పార్లమెంట్‌పై దాడిల నేపథ్యంలో దేశానికి బలవంతమైన నాయకుడు కావాలని తాను ఎదురుచూశానని ఆ నాయకత్వం నరేంద్రమోడీలో కనిపించిందన్నారు. నాడు బీజేపీకి మద్దతు తెలిపినందుకు తనను చాలా మంది వ్యతిరేకించారన్నారు. అయినప్పటికీ తాను వెనుకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. తాను పవన్ కల్యాణ్ పిలిస్తేనే తాను ఢిల్లీ వెళ్లానని చెప్పుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు బలమైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే తాను చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచినట్లు వెల్లడించారు. విజన్ 2020 పేరుతో చంద్రబాబు వెళ్లడాన్ని తాను స్వాగతించినట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుభవం,శక్తిసామర్థ్యాలు వెలకట్టలేనివి అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Read More: చంద్రబాబుతో ముగిసిన ములాఖత్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు