చంద్రబాబు అరెస్ట్ : సజ్జల రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-09 09:23:36.0  )
చంద్రబాబు అరెస్ట్ : సజ్జల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థతో అప్పట్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి పది శాతం వాటా ఉందన్నారు. ప్రభుత్వ వాటాలో రూ.240 కోట్లు దారి మళ్లిందన్నారు. 2020 ఆగస్టులో విచారణకు వైసీపీ ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మంత్రి వర్గ ఉపసంఘంతో విచారణ చేపట్టామన్నారు. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్ విచారణ చేపట్టిందన్నారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ ఎంక్వైరీ స్టార్ట్ చేసిందన్నారు. కేసు 2021 డిసెంబర్ 9న సీఐడీకి బదిలీ అయిందన్నారు.

2015లో యువతకు నైపుణ్య శిక్షణకు రూ.3,350 కోట్ల ప్రాజెక్టు చేపట్టారన్నారు. ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణమన్నారు. వాస్తవాలను ప్రభుత్వం తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అసలు విషయం చెప్పకుండా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ కేసులో 9.12.2021న ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. సీఐడీకి చెందిన సిట్ దర్యాప్తు చేస్తోందన్నారు. స్కామ్ లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయన్నారు. రూ.340 కోట్లలో రూ.270 కోట్లు దారి మళ్లినట్లు 2017, 2018లోనే ఆరోపణలు వచ్చాయన్నారు. స్కామ్ లో దర్యాప్తు జరుగుతోందని, రాజకీయ ప్రమేయం లేదన్నారు. అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు.

Advertisement

Next Story