కందుకూరు మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

by Nagaya |   ( Updated:2022-12-29 08:30:00.0  )
కందుకూరు మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో : కందుకూరు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తొలుత గడ్డం మధు ఇంటికి వెళ్ళి మృత దేహానికి పూలదండ వేసి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి....వారికి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ తరుపున రూ.15 లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. చదువుకునే పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Also Read...

Kandukur Stampede: ఒక్కో కుటుంబానికి రూ.24లక్షలు ఆర్థికసాయం: TDP

Advertisement

Next Story

Most Viewed