- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమండ్రి నుంచి భారీ ఊరేగింపుగా ఉండవల్లికి చంద్రబాబు... ఆ నియోజకవర్గాల మీదుగా రూట్ మ్యాప్ ఇదే
దిశ , డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జైలు సిబ్బంది సైతం చంద్రబాబు బ్యాకర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో మధ్యాహ్నాం 3 గంటలకు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ఊరేగింపుతో చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారని తెలుస్తోంది. రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్‌ను టీడీపీ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై చర్చించేందుకు రాజమండ్రి క్యాంపు సైట్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో సమావేశమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకుంటారని తెలుస్తోంది.
రూట్ మ్యాప్ వివరాలు ఇవే..
మధ్యాహ్నాం 3 గంటలకు రాజమహేంద్రవరం జైలు నుంచి ఈ భారీ ఊరేగింపు జరగనుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు(రాజమండ్రి సిటీ),లాలా చెరువు(రాజానగరం),మోరంపూడి(రాజమండ్రి సిటీ), బొమ్మూరు(రాజమండ్రి రూరల్), వేమగిరి(రాజమండ్రి రూరల్), జొన్నాడ సెంటర్(మండపేట) రావులపాలెం(కొత్తపేట), సిద్ధాంతం సెంటర్(ఆచంట), పెరవలి(నిడదవోలు), తణుకు(తణుకు), తాడేపల్లిగూడెం(తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలం గోపాలపురం), భీమడోలు(ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలం(గోపాలపురం), దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్(గన్నవరం, నూజివీడు, గుడివాడ), గన్నవరం, రామవరప్పాడు రింగ్ రోడ్(విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్),బెంజ్ సర్కిల్( విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్,పెనమలూరు),కనకదుర్గ వారధి(విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు పార్లమెంట్), మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మీదుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 3 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ ఊరేగింపు రాత్రి 9.20 గంటలకు ఉండవల్లిలో ముగుస్తుంది అని టీడీపీ వెల్లడించింది.