- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు
దిశ, వెబ్‌డెస్క్: వరదలపై నష్టాన్ని అంచనా వేయడానికి రేపు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న బృందాలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. వరద బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందించేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు బుధవారం సాయంత్రం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. అంతకుముందు.. ‘ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితిని మోడీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈరోజు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి (విపత్తు నిర్వహణ) నేతృత్వంలో నిపుణులతో కూడిన కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత తదితర అంశాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుంది మరియు తక్షణ సహాయం కోసం సిఫార్సులు చేస్తుంది’ అని నెట్టింట అమిత్ షా ట్వీట్ పెట్టారు.