YS వివేకా హత్యపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
YS వివేకా హత్యపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ట్వీట్ చేశారు. వివేక హత్యకు నాలుగేళ్లు అయిన సందర్భంగా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అంటూ ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని పులివెందుల పూల అంగాళ్ల నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పని కూడా చేయలేక పోయారని.. చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించలేకపోయాడని ఎద్దేవా చేశారు. వివేకా హత్య ఆ ఇంట జరిగిన కుట్రే అని ఇది రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారన్నారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి.. బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి.. ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? అంటూ వివేకా హత్య పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story