- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఏర్పాట్లు.. విశేషాలివే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రిగా ఈ నెల12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు అతిరథుల హాజరుకావడంతో భద్రతను సైతం పటిష్టంగా చేస్తున్నారు. దాదాపు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారు. ప్రధాని సైతం వస్తుండటంతో కేంద్రబలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ రాకపై ఇప్పటికే పీఎంవో కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఇప్పటికే తెలుగుదేశ పార్టీ నాయకులు ఆహ్వానాలు పంపారు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం వేధింపులకు బలైన కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో పాటు 112 కుటుంబాలకు ఆహ్వానం పంపారు. అంతేకాదు వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు.
చంద్రబాబుతో పాటు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో అందరికీ సరిపోయేలా సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభ స్థలంలో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలను రెడీ చేస్తున్నారు. 14 ఎకరాల ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదికతో పాటు వీఐపీ గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. ఇక ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం గన్నవరం ఎయిర్‌పోర్టులో 12 హెలిప్యాడ్లను ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి వీవీఐపీల కాన్వాయ్‌లు నేరుగా గన్నవరం కేసరపల్లి సభ వద్దకు వెళ్లే మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల్లో ఈ కార్యక్రమానికి వచ్చే వారికి కోసం 65 ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.