ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు: భారీ కాన్వాయ్‌తో పయనం

by Seetharam |
ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు: భారీ కాన్వాయ్‌తో పయనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు ఉత్తర్వులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సిబ్బందికి ఆదేశాలు అందిన నేపథ్యంలో చంద్రబాబు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణలు చంద్రబాబు నాయుడుకు ఎదురెల్లి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుతోపాటు మరికొంతమంది టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, నేతలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్దకు తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలినడకన చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఎన్‌ఎస్‌జీ వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ అభిమానం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఈ 45ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ తప్పు చేయలేదు, చేయబోను’ అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

రూట్ మ్యాప్ ఇదే..

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజలు చూపించిన అభిమానం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని చేయబోనని చంద్రబాబు నాయుడు గంటాపథంగా చెప్పుకొచ్చారు. అనంతరం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి భారీ కాన్వాయ్‌గా ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు తరలివెళ్లనున్నట్లు తెలుస్తోంది.అయితే రేపటి వరకు ర్యాలీలు చేయవద్దని, మీడియాతో మాట్లాడవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడే అవకాశం లేవని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు భారీ ఊరేగింపు కాకుండా..ప్రధాన కూడలి వద్ద చంద్రబాబు నాయుడు అభివాదం చేసేలా టీడీపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఉండవల్లిలోని తన నివాసం వరకు చంద్రబాబు నాయుడు 26 నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు కాన్వాయ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు(రాజమండ్రి సిటీ),లాలా చెరువు(రాజానగరం),మోరంపూడి(రాజమండ్రి సిటీ), బొమ్మూరు(రాజమండ్రి రూరల్), వేమగిరి(రాజమండ్రి రూరల్), జొన్నాడ సెంటర్(మండపేట) రావులపాలెం(కొత్తపేట), సిద్ధాంతం సెంటర్(ఆచంట), పెరవలి(నిడదవోలు), తణుకు(తణుకు), తాడేపల్లిగూడెం(తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలం గోపాలపురం), భీమడోలు(ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలం(గోపాలపురం), దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్(గన్నవరం, నూజివీడు, గుడివాడ), గన్నవరం, రామవరప్పాడు రింగ్ రోడ్(విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్),బెంజ్ సర్కిల్( విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్,పెనమలూరు),కనకదుర్గ వారధి(విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, గుంటూరు పార్లమెంట్), మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మీదుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు రాత్రి 9.30 గంటలకు ఉండవల్లిలో ముగుస్తుంది అని టీడీపీ వెల్లడించింది.

Read More..

నేను తప్పు చేయలేదు.. చేయను..చేయబోను : బెయిల్‌పై విడుదలైన అనంతరం చంద్రబాబు



Next Story