- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా DSC ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీకి తాజాగా బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ఇవాళ నాలుగో సారి బాధ్యలు స్వీకరించారు. అనంతరం బాబు ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్పీ ఫైల్‌పై సీఎంగా ఫస్ట్ సైన్ చేశారు. మెగా డీఎస్సీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారుల 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టనున్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీ విభజన అనంతరం 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. మెగా డీఎస్సీకి బాబు ఆమోదం తెలపడంతో త్వరలోనే అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో నిరుద్యుగులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు.