- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Challenge: దమ్ముంటే చర్చకు రా..: జగన్‌కు మంత్రి జనార్దన్ రెడ్డి సవాల్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాం(Ycp Government)లో రోడ్లు అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయి ఐదేళ్ల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు అయితే చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government) వచ్చిన తర్వాత రోడ్ల దుస్థితిపై దృష్టి సారించి నిధులు కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లను అధికారులు మరమ్మతులు చేస్తున్నారు.
అయినా సరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్(YSR Congress Party Chief Ys Jagan), ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(Minister BC Janardhan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీ సమావేశాల(Assembly Sessions)కు రావాలని ఛాలెంజ్ చేశారు. జగన్‌కు ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తామని చెప్పారు. ఎవరి తప్పులు ఏంటో అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న పోర్టులపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే సహించమని, కచ్చితంగా శిక్షిస్తామని మంత్రి జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు.