ఎన్నికల వేళ సీఈసీ కీలక నిర్ణయం.. ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

by Disha Web Desk 16 |
ఎన్నికల వేళ సీఈసీ కీలక నిర్ణయం.. ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రలోభాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా డబ్బు, బంగారం, వెండి, మద్యం, చీరలు, గిఫ్టు ఐటెమ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల అధికారులు దూకుడు పెంచారు. తాజాగా ఎన్నికల నిబంధనల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రామ్ మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా, నీనా నిగమ్‌ను నియమించారు. వచ్చే వారంలో ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రంలో ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. స్పెషల్ జనరల్ అజ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అజ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ముగ్గురు అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు.


Next Story

Most Viewed