పోలవరం పనుల్లో కదలిక.. రాష్ట్రానికి రానున్న నలుగురు అంతర్జాతీయ నిపుణులు

by srinivas |
పోలవరం పనుల్లో కదలిక.. రాష్ట్రానికి రానున్న నలుగురు అంతర్జాతీయ నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం పనులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అడగులు వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి అంతర్జాతీయ నిపుణులను పంపనుంది. ప్రాజెక్టు నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలపై నలుగురు నిపుణులను ఎంపిక చేసింది. అమెరికా, కెనాడాకు చెందిన నిపుణులను ఈ నెల 27న రాష్ట్రానికి పంపనుంది. వీరు జులై 5 వరకూ పోలవరంలో ఉండనున్నారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. అనంతరం కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. మూడు నెలలకోసారి ఈ నలుగురు నిపుణులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. నిర్మాణాన్ని పూర్తి చేసే వరకూ సాంకేతికంగా సలహాలు, సూచనలు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed