- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ శ్రేణుల్లో సంబరాలు...ట్రెండ్ అవుతున్న ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తాత్కాలిక ఊరట లభించింది. చంద్రబాబు ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐదు కండీషన్లతో ఈ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కు ఏపీ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తమ పార్టీ అధినేత ఎప్పుడు బెయిల్‌పై బయటకు వస్తారా అని టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట, రాజమహేంద్రవరం, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద అలాగే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ‘బాబు ఈజ్ బ్యాక్’, ‘నిజం గెలిచింది’ వంటి హ్యాష్‌టాగ్‌లను జత చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హ్యాష్ టాగ్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాలపాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా కోర్టులో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చంద్రబాబు ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.