- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viveka Case: జగన్‌కు ముందే తెలుసు .. సీబీఐ కౌంటర్‌లో సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు సంచలన విషయాలు ప్రస్తావించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు సాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు వెలుగులోకి వస్తున్నారు. సీబీఐ అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ కౌంటర్‌లో జగన్ పేరు ప్రస్తావించారు. వివేకానందారెడ్డి మృతి జగన్‌మోహన్ రెడ్డికి అదే రోజు ఉదయం 6.15 నిమిషాలకే తెలుసని వెల్లడించారు. వివేకా అప్పటి పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే జగన్‌కు తెలిసిందని పేర్కొన్నారు. అయితే జగన్ కు అవినాశ్ రెడ్డి ముందే చెప్పారా? అనే తేలాల్సి ఉందని తెలిపారు. అవినాశ్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. వివరించారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 12.27 గంటల నుంచి 1.10 గంటల వరకు అవినాశ్ రెడ్డి వాట్సాప్ కాల్ మాట్లాడారని కౌంటర్‌లో సీబీఐ అధికారులు తెలిపారు.
మరోవైపు అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడంలేదని, ఇప్పటికే రెండు సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదని అనుబంధ కౌంటర్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తల్లి అనారోగ్యం పేరుతో విచారణకు హాజరుకాకుండా హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారని తెలిపారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకే సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లారని, శాంతి భద్రతల దృష్ట్యా వెనుదిరగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జూన్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ అవినాశ్ రెడ్డి విచారించాలని.. ఈ మేరకు ఆయనకు బెయిల్ ఇవ్వొదని సీబీఐ అధికారులు కౌంటర్‌లో దాఖలు చేశారు.