- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Liquor Scam: అలా చేస్తే బెయిల్ ఛాన్స్ ఉంటుందట.. కవితకు కీలక సూచన
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొంతమందికి నోటీసులు జారీ అయ్యారు. ఇదే వ్యవహారంలో సీబీఐతో పాటు ఈడీ కూడా దూకుడు పెంచింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు అందాయి. దీంతో ఎమ్మెల్సీ కవిత అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. పలు కీలక సూచనలు చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకపోతే సదరు వ్యక్తిని అరెస్ట్ చేస్తారని తెలిపారు. అయితే ముందస్తు బెయిల్ ప్రయత్నం చేయొచ్చని పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తే బెయిల్ వెసులుబాటు అవకాశం ఉంటుందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఈ కేసులో తనకు సంబంధం లేదని ఆరోపిస్తున్నారు. రాజకీయంలో భాగంగానే తనపై కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ఆమె సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ వెళ్లారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని కోరుతున్నారు. అయితే ఈడీ నుంచి రిప్లై రాకపోవడంతో తాను ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.