Cabinet Meeting: నేడు ఏపీ మంత్రి‌వర్గ భేటీ.. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై ప్రకటన వచ్చే ఛాన్స్!

by Shiva |
Cabinet Meeting: నేడు ఏపీ మంత్రి‌వర్గ భేటీ.. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై ప్రకటన వచ్చే ఛాన్స్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు వెలగపూడి (Velagapudi)లోని సచివాలయం (Secretariat)లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan, మంత్రులు (Ministers), సీఎస్ విజయానంద్‌ (CS Vijayanand)తో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా హాజరు కానున్నారు. అయితే, ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన మరిన్ని అన్న క్యాంటీన్ల (Anna Canteens) ఏర్పాటుపై చర్చించనున్నారు. అదేవిధంగా గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వారికి 10 శాతం మద్యం షాపుల (Liquor Shops) కేటాయింపు విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. మహిళలకు ఆర్టీసీ (RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా పలు కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేలా వివిధ కార్పొరేట్ సంస్థల భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లుగా తెలుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) లేవనెత్తిన అభ్యంతరాలను కూడా సమావేశంలో చర్చకు రానున్నాయని సమాచారం.

Next Story