- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మచిలీపట్నంలో దారుణ హత్య...విచారణ చేస్తున్న పోలీసులు
by Seetharam |

X
దిశ, డైనమిక్ బ్యూరో : మచిలీపట్నం ముస్తఖన్ పేటలో దారుణ హత్య జరిగింది. 23వ డివిజన్ ముస్తఖన్ పేటకు చెందిన వెంపటి గిరిధర గోపాల్(33) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇకపోతే దారుణ హత్యకు గురైన వెంపటి గిరిధర గోపాల్ కోనేరు సెంటర్ దుర్గా స్వీట్స్‌లో పనిచేస్తాడు అని తెలిసింది. గిరిధర గోపాల్ హత్యతో 23వ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ హత్య గురించి తెలుసుకున్న మచిలీపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
Next Story