- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీలో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే వెంకటకృష్ణరావు కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. అయితే, ఆయన గత కొన్నాళ్ల నుంచి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన పార్థీవ దేహాన్ని బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం దొమ్మెరుకు తీసుకెళ్లనున్నట్లుగా బంధువులు, కుంటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 5 సార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా కృష్ణబాబు ప్రతినిథ్యం వహించారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 1983, 1985, 1989, 1994, 2004లో ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెండ్యాల వెంకటకృష్ణరావు కన్ను మూశారని తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్య నేతలు, నాయకులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.