- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేక్ పడింది: ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఎస్ఐ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని...గతంలో అర్హులైన వారిని ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ప్రశ్నంచింది. ఈ మేరకు ఎస్ఐ సెలక్షన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఎస్ఐ నోటిఫికేషన్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.