- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
BR Naidu: ఈ నెల 18న నూతన పాలకమండలి సమావేశం.. టీటీడీ బోర్డు చైర్మన్ ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో నూతనంగా ఏర్పాటు అయిన టీటీడీ బోర్డు చైర్మన్(TTD Board Chairman) పాలక మండలి తొలి సమావేశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న టీటీడీ నూతన పాలకమండలి(TTD New Governing body) సమావేశం పెట్టాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు(BR Naidu) నూతన పాలక మండలి సమావేశం ఏర్పాటు తేదీని ప్రకటించారు.
నవంబర్ 18న ఉదయం 10:15 గంటలకు తిరుమల అన్నమయ్య భవనం(Tirumala Annamayya Building)లో పాలక మండలి సభ్యులతో తొలి సమావేశం(First Meeting) నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడాక తొలి బోర్డు సమావేశం జరగబోతున్నదని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ(YSRCP Government) హయాంలోని టీటీడీ బోర్డు చైర్మన్ సహా సభ్యులు రాజీనామా(Resign) చేశారు. దీంతో ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలక మండలి సభ్యులను నియమించింది. టీటీడీ బోర్డు చైర్మన్ గా బీఆర్ నాయుడు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.