విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

by Mahesh |
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికకు మంగళవారం చివరి తేదీ కావడంతో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండటంతో.. స్వాతంత్ర్య అభ్యర్థిగా ఉన్న షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఎవరు లేకుండా పోయింది. మరికొద్ది సేపట్లో బొత్స సత్యనారాయణను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

Next Story