Black Magic: అన్నమయ్య జిల్లాలో క్షుద్రపూజల కలకలం

by Rani Yarlagadda |   ( Updated:2024-11-17 06:54:10.0  )
Black Magic: అన్నమయ్య జిల్లాలో క్షుద్రపూజల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఆధునిక యుగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్నా.. ఇంకా కొందరు క్షుద్రపూజల్ని (Black Magic) నమ్ముతున్నారు. గుప్తనిధులు దొరుకుతాయన్న మూఢనమ్మకంతో క్షుద్రపూజలు చేస్తున్నారు. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా (Annamaiah District)లో క్షుద్రపూజలు కలకలం రేపాయి.

పప్పిరెడ్డిగారిపల్లెకు సమీపంలో ఉన్న ఓ పురాతన ఆలయంలో.. గుప్తనిధుల కోసం కొందరు వ్యక్తులు తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డిలను అరెస్ట్ చేశారు. ఇద్దరినీ విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed