- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పనులు పెండింగ్.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి రైల్వే స్టేషన్ ను ఆరు నెలల్లో ఆధునీకరిస్తామని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్(Anakapalli BJP MP CM Ramesh) అన్నారు. ఆదివారం అనకాపల్లి రైల్వే స్టేషన్(Anakapalli Railway Station) ఆధునీకరణ(Modernized)పై అధికారులతో సమీక్ష జరిపిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్(Vikasit Bharat) లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను నూతనంగా తీర్చిదిద్దుతున్నదని, విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అనకాపల్లి రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరిస్తున్నామని తెలిపారు.
ఇక్కడ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించామని, స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. అలాగే రెండు మూడు రోజుల్లో మరో సమావేశం ఏర్పాటు చేసి ఆరు నెలల్లో అన్ని సమస్యలు పూర్తి చేసి, పూర్తిగా ఆదునీకరించేందుకు ప్రణాళికలు చేస్తామని తెలిపారు. ఇక గత ప్రభుత్వం(YCP Govt) పుణ్యమా అని కొన్ని పనులు పెండింగ్(Works Pending) లో పడ్డాయని ఆరోపించారు. 2014 నుంచి 2019 మధ్యలో కేంద్ర ప్రభుత్వ(Central Govt) సహకారంతో పనులు చాలా వరకు పూర్తి చేసి, కాంపెన్షేషన్ డబ్బు డిపాజిట్ చేస్తే.. గత ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బును వెనక్కి తీసుకొని పనులను పెండింగ్ లో పెట్టి, అనకాపల్లి ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా చేశారని మండిపడ్డారు. ఈ డబ్బులు త్వరలోనే వెనక్కి ఇప్పించి పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.