AP:‘జగన్‌తో దీక్ష చేయించగలరా?’.. భూమనకు బీజేపీ నేత సవాల్!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-04 09:52:28.0  )
AP:‘జగన్‌తో దీక్ష చేయించగలరా?’.. భూమనకు బీజేపీ నేత సవాల్!
X

దిశ, వెబ్‌డెస్క్:ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ దీక్ష పై పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీక్ష పై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత(BJP Leader) భాను ప్రకాష్ ఫైర్ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ను స్వామి అని సంభోంధించిన భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భాను ప్రకాష్ వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భూమనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో భూమన దీక్ష చేయించగలరా? అని సవాల్ విసిరారు. హిందూ సంప్రదాయం ప్రకారం జగన్‌తో ఇంట్లో పూజలు చేయించగలిగే సత్తా భూమనకు ఉందా? అని ప్రశ్నించారు. హిందూ మత విశ్వాసాలను గౌరవించని వ్యక్తి వైఎస్ జగన్(YS Jagan) అని విమర్శించారు.

Next Story

Most Viewed