విశాఖలో వైసీపీకి బిగ్ షాక్: గాజువాక ఇన్‌చార్జి రాజీనామా

by Seetharam |
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్: గాజువాక ఇన్‌చార్జి రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీకి చెందిన మరో కీలక నేత రాజీనామా చేశారు. గాజువాక వైసీపీ ఇన్‌చార్జి తిప్పల దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఒకేరోజు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయడం రాజకీయంగా ప్రకంపనటు సృష్టిస్తోంది. ఇకపోతే విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం హాట్ సీట్. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గాజువాక నియోజకవర్గం నుంచి తిప్పల నాగిరెడ్డి గెలుపొంది జెయింట్ కిల్లర్‌గా మారారు. తిప్పల నాగిరెడ్డి గెలుపొందడంలో ఆయన తనయుడు, ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జి దేవన్ రెడ్డియే. అలాంటి తిప్పల దేవన్ రెడ్డి అకస్మాత్తుగా వైసీపీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి దేవన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి ఉంటారని ప్రచారం ఉంది. అయితే కొన్ని రోజులుగా ఆయన పార్టీలో సైలెంట్‌గా ఉంటున్నట్లు సమాచారం. అయితే అకస్మాత్తుగా సోమవారం పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. దేవన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కూడా ఉంది.

Advertisement

Next Story

Most Viewed