విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి కార్పొరేటర్ల క్యూ

by srinivas |   ( Updated:2024-11-11 15:29:29.0  )
విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి కార్పొరేటర్ల క్యూ
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, సీనియర్ నేతలు జనసేన(Janasena) తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికతో పాటు 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 38వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం జెడ్పీటీసీ యేసుపోగు దేవమణి, అమలాపురం మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గుణిశెట్టి చినబాబు, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త, ఎన్.వి.ఆర్.ట్రస్ట్ ఫౌండర్ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ధర్మవరం మున్సిపాలిటి నుంచి ఎం.రమణమ్మ, తోపుదుర్తి వెంకట్రాముడు, సరితాల ఆషాబీ, సరితాల మహ్మద్ బాషా, పి.రమాదేవి, వై.రాజు, తొండమాల ఉమాదేవి, రవిప్రసాద్, నాగార్జున, సోమశేఖర్ పార్టీలో చేరారు. వీరందరికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Janasena Party Chief Pawan Kalyan) సాదరంగా ఆహ్వానం పలికారు. విజయవాడలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పి.హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు మండలి రాజేష్, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.


  • Dishadaily Web Stories

  • Advertisement

    Next Story

    Most Viewed