- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Yoga: వేలిముద్రలతో యోగా.. ఈ సమస్యలు దూరం..?

దిశ, వెబ్‌డెస్క్: యోగా (Yoga) అనేది సున్నితమైన వ్యాయామం(exercise). ప్రతి రోజూ ఉదయం లేదా ఒత్తిడి(stress)కి గురి అయినప్పుడు యోగా చేయడం వల్ల మైండ్‌లోని చెడు ఆలోచనలు అన్ని దూరం అవుతాయి. బాడీ రిలాక్స్ (Relax the body) గా ఉంటుంది. క్రియేటివిటి పెరుగుతుంది. శ్వాస నియంత్రణ, రక్తపోటు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగుపర్చడంలో, సమతుల్యత, బలం, నొప్పి నిర్వహణకు సహాయపడుతుంది.శ్రేయస్సు పెరుగుతుంది. ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. పరిసరాలతో మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
అయితే ఉదయం పూట వేలిముద్రలతో యోగా చేస్తే పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. చేతి వేళ్లకు బాడీ ప్రతి భాగాన్ని కదిలించే శక్తి ఉంటుందని నిపుణులు అంటున్నారు. వేలి కొనలను కలపడం వల్ల డే మొత్తం బాడీ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో నరాల ఆరోగ్యం (Nerve health)కూడా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చేతి వేళ్లతో ముద్రలు వేయడం ద్వారా అంతర్గత శక్తి ఉత్తేజితం అవుతాయని అంటున్నారు.
తద్వారా నీరసం, అలసట, నిస్సత్తువగా అనేవి దూరం అవుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి (Immunity) పెరగడంలో కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. వేలి ముద్రలతో యోగా చేయడం వల్ల జ్జానం, ఏకాగ్రత, జ్జాపకశక్తి (Momory Loss) మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ యోగా చేయడానికి ప్రశాంతమైన ప్లేస్ ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. నేలపై కూర్చున్నాక వెనక భాగం నిటారుగా ఉందో లేదో చూసుకోవాలి. బొటనవేలు కొనను మీ చూపుడు వేలుకు తాగించి.. మిగతా వేళ్లను చాపి ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
వేలిముద్రలతో యోగా చేస్తున్నప్పుడు పూర్తి దృష్టి వేళ్లపైనే ఉంచాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం అవుతాయి. తల నొప్పి(), గొంతులో నొప్పి తో బాధపడుతున్నప్పుడు, స్కిన్ మీద దద్దులు వంటి ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా జ్వరం, ఒళ్లు నీరసంగా ఉండే వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.