- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్..ఎట్టకేలకు పచ్చజెండా ఊపిన అధికారులు!
దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారీ ఊరట దక్కింది. పిఠాపురంలో రోడ్ షోకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఈ నెల 10న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించాలని జనసేన ప్రణాళిక రూపొందించుకొంది. ఈ మేరకు మంగళవారం ఆర్‌వో కార్యాలయంలో అనుమతి ఇవ్వాలని జనసేనాని కోరారు. అయితే అనుమతి పై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మంగళవారం సాయంత్రం వరకు ఈ విషయంపై స్పష్టత రాలేదు. అయితే బుధవారం సాయంత్రం రోడ్ షోకు అనుమతి ఇస్తున్నట్లు కూటమి నేతలకు సమాచారం ఇచ్చారు. దీంతో రోడ్ షోకు లైన్ క్లియర్ అయ్యింది.
ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ నెల 10న పిఠాపురంలో సీఎం వైఎస్ జగన్ సభ కూడా ఉంది. అందుకే ఆ రోజు రోడ్ షోకు అనుమతిపై సందిగ్థత ఏర్పడినట్లు సమాచారం. అయితే ఆ రోజున ఉన్న సీఎం జగన్ సభను వాయిదా వేసినట్లు సమాచారం. అందుకే రోడ్ షోకు అనుమతించారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పిఠాపురంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ మొత్తానికి పవన్ రోడ్ షోకు అనుమతి రావడంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More..
AP Elections 2024:ఏపీలో ఆ పార్టీదే అధికారం..రెండు సర్వేల్లో వచ్చిన రిజల్ట్ ఇదే!