BIG News: ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి అవన్నీ ఉచితంగానే

by Shiva Kumar |
BIG News: ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి అవన్నీ ఉచితంగానే
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకుండా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రస్తుం విద్యార్థుల అభ్యున్నతికి తొలి అడుగు వేసింది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్కులను పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. టెక్ట్స్ బుక్స్‌తో పాటు నోట్‌బుక్‌లు, బ్యాగ్‌లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు.

Next Story