BIG BREAKING: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ

by Shiva |
BIG BREAKING: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మునిసిపాలిటీపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లను బ‌దిలీ చేస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిప‌ల్, ప‌ట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా ప‌లువురు క‌మిష‌న‌ర్లను మాతృశాఖ‌కు బ‌దిలీ చేయగా, మ‌రికొందరిని మున్సిప‌ల్ శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story