ఆ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో బిగ్ బాస్ శివాజీ!

by Disha Web Desk 18 |
ఆ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో బిగ్ బాస్ శివాజీ!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీ నటులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు విస్తృత ప్రచారం కొనసాగించారు. అయితే ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అది ఏంటంటే..2019 ఎన్నికలప్పుడు ఆపరేషన్ గరుడ,ఆపరేషన్ ద్రవిడ అంటూ తెగ హడావిడి చేసి టీడీపీ తరఫున పసుపు సైనికుడిగా పనిచేసిన వ్యక్తి హీరో శివాజీ. బిగ్ బాస్ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినట్లు సమాచారం.

కానీ ప్రజెంట్ 2024 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధం అయ్యారు. పల్నాడులో ప్రచారం నిర్వహించి పొలిటికల్ పంచ్‌లు పేల్చుతూ టీడీపీని గెలిపించడానికి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ వాళ్లకి పల్నాడులో ఎవరూ అభ్యర్థులు దొరకలేదా? ఒకరేమో గుంటూరు, ఇంకొకరేమో నెల్లూరు నుంచి వచ్చారు. లోకల్‌లో ఎవరూ దొరకలేదా అంటూ వైసీపీ పార్టీకి సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబుకి ఓటేయకపోతే రాబోయే తరాల భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పారు. మీరు మళ్లీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయని అన్నారు. అందుకే టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారిని, కృష్ణరాయులు గారిని అధిక మెజార్టీతో గెలిపించండని కోరారు.

Next Story

Most Viewed