- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోకేశ్ వద్దకు భువనేశ్వరి, బ్రహ్మణి ఇతర కుటుంబ సభ్యులు.. మరికాసేపట్లో చంద్రబాబుతో భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో లోకేశ్ బస చేసిన క్యాంప్ వద్దకు చేరుకున్నారు. ఉండవల్లిలోని తమ నివాసం నుంచి నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, నందమూరి రామకృష్ణలు చేరుకున్నారు. నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, చిన్నల్లుడు శ్రీభరత్‌లు సైతం లోకేశ్ క్యాంప్ వద్దకు చేరుకున్నారు. వీరంతా లోకేశ్‌తో సమావేశమై చర్చిస్తున్నారు. మరోవైపు పార్టీకి చెందిన ముఖ్య నేతలు సైతం క్యాంప్ వద్దకు చేరుకుని చర్చిస్తున్నారు. ఇకపోతే సాయంత్రం నాలుగు గంటలకు ములాఖత్‌లో భాగంగా స్కిల్ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును కుటుంబ సభ్యులు కలవనున్నారు. వారానికి రెండు సార్లు మాత్రమే చంద్రబాబు ములాఖత్‌కు అధికారులు అవకాశం కల్పించారు.
జైలులో యోగా చేసిన బాబు
ఇకపోతే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్‌ను చంద్రబాబుకు కేటాయించారు.బ్లాక్‌లో ఒక పత్రేక గదిని చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. ఇకపోతే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి త్వరగా నిద్రపోయారు. మంగళవారం ఉదయం నిద్ర లేచి వాకింగ్ చేశారు. ఆ తర్వాత యోగా కూడా చేశారు. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన సహాయకుడు ఆయనకు అల్పాహారాన్ని అందించాడు. అనంతరం చంద్రబాబు మెడిసిన్ వేసుకున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే.