Meghalakonda: అరకులోయలో కనువిందు చేస్తోన్న మేఘాలకొండ

by Rani Yarlagadda |   ( Updated:2024-10-25 06:19:07.0  )
Meghalakonda: అరకులోయలో కనువిందు చేస్తోన్న మేఘాలకొండ
X

దిశ, వెబ్ డెస్క్: వింటర్ వస్తుందంటే చాలు.. టూరిస్టులు, విహారయాత్రకు వెళ్లాలనుకునేవారితో పాటు ప్రకృతి ప్రేమికుల చూపు అరకు వైపే ఉంటుంది. అక్టోబర్ చివరి నుంచి మొదలు.. ఫిబ్రవరి వరకూ ఉండే చలికాలంలో.. అరకులోయలో కనిపించే ప్రకృతి అందాలు.. చూపరులను కట్టిపడేస్తాయి. అసలు అక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా.. అనేలా కనువిందు చేస్తాయి. హిల్ స్టేషన్ అయిన అరకులోయలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. పద్మాపురం గార్డెన్స్, కాఫీ మ్యూజియం, గాలికొండ వ్యూ పాయింట్ (Galikonda View Point), అనంతగిరి వాటర్ ఫాల్స్, కటికి వాటర్ ఫాల్స్, చాపరై వాటర్ క్యాస్కేడ్, బొర్రా కేవ్స్, మేఘాలకొండ.. ఉన్నాయి.

వీటిలో మేఘాలకొండ (Meghala Konda) అందాలను చూసేందుకు పర్యాటకులు రాత్రి నుంచి వేకువజాము వరకూ వేచి ఉంటారు. కొండల మధ్యలోంచి వచ్చే ఆ పొగమంచు సోయగాల్ని కళ్లారా చూడగానే.. రాత్రంతా పడిన కష్టాన్ని మరచిపోతారు. ఆంధ్రా ఊటీ(Andhra Ooty)గా పేరుగాంచిన అరకులోయ (Araku Valley)లో మేఘాలకొండ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసింది. అరకులోయ మండలం లంతంపాడు సమీపంలోనున్న కొండపై నుంచి చూస్తే.. పాలసంద్రంలా వచ్చే మేఘాలు కొండల మధ్యలోంచి వెళ్తుంటాయి. ఆ అందమైన దృశ్యాన్ని చూడాలంటే రెండు కళ్లూ చాలవంటే నమ్మండి. అప్పుడే తెల తెల్లవారుతుండగా.. నులివెచ్చని సూర్యకిరణాలు వస్తుండగా.. కొండల మధ్యలో నుంచి వెళ్లే పొగమంచు దృశ్యాలు మనసుకెంతో హాయినిస్తాయి.

Next Story