- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balineni Srinivasa Reddy: రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్‌తోనే.. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి మకాం మారుస్తారో చెప్పలేని పరిస్థితి. పార్టీ అధినేతలకు అతి సన్నిహితులు కూడా ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పక్కచూపులు చూస్తున్నారు. పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఇలాంటి ప్రచారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిపై కూడా సాగింది. అయితే ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. అలానే తాను ఒంగోలు నుంచే చేస్తున్నట్లు వెల్లడించారు. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తాను అని తెలిపిన ఆయన.. కేవలం విలువల కోసం మాత్రమే తన మంత్రి పదవిని కూడా వదులుకొని సీఎం జగన్ వెంట నడిచానని వెల్లడించారు.
సామాజిక సమీకరణల నేపథ్యం లోనే ఎమ్మెల్యేల స్థానాల మార్పు జరుగుతోందన్నారు. కాగా తాను గిద్దలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అలానే తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని కొట్టిపారేశారు. కాగా తాను అసలు తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లోనే లేనని తేల్చి చెప్పారు. అలానే తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు సీఎం జగన్ వెంటే ఉంటానని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు వైసీపీకి అలానే సీఎం జగన్ కు అండగా ఉండాలని తెలిపిన ఆయన.. ఎంపీ మాగుంట విషయాన్ని కూడా సీఎం జగన్ తో మాట్లాడుతానని వెల్లడించారు. అయితే సీట్లు, పోటీపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి శిరసావహించాలని క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.