- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తిపై హత్యాయత్నం.. ఈ ఘటన వెనక రాజకీయ హస్తం..?
దిశ ప్రతినిది, విశాఖపట్నం: గుంటూరు నగరంలోని అమరావతి రోడ్లో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ఓ వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం నగరంలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ చరిత్ర ఉన్న గుంటూరులో, పైగా పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగ విధుల్లోకి చేరిన రోజునే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి రోడ్డులోని గురువారం సాయంత్రం శంకర్ బార్ అండ్ రెస్టారెంట్లో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఒంటరిగా మద్యంసేవిస్తున్నాడు.
కాగా ఈ విషయాన్ని తెలుసుకున్న మరో వర్గం శంకర్ బార్ అండ్ రెస్టారెంట్ కి చేరుకున్నారు. అనంతరం వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. ఖాళీ మద్యం సీసాలతో అధికారపార్టీ వ్యక్తి తలను టార్గెట్ చేస్తూ దాడి చేశారని ఘటనా స్థలంలో ఉన్న కొంతమంది చెప్తున్నారు. ఇక హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో బార్ అండ్ రెస్టారెంట్లో మిగిలినవారంతా ప్రాణ భయంతో పరుగులు పెట్టినట్లు తెలుస్తోంది. అలానే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తీసిన వారిని కూడా దాడికి పాల్పడిన వ్యక్తులు బెదిరించినట్లు సమాచారం. ఎన్నికల వేళలో అధికార పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు ఒకరి పై ఒకరు దాడులు చేసుకుని ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది.