- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో స్కూలు విద్యార్థి మృతి.. విచారణకు ఆదేశించిన నారా లోకేశ్
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు కేఎన్ఆర్ ప్రభుత్వ స్కూల్లో దారుణం జరిగింది. నూతనంగా నిర్మించిన సన్ సైడ్ కూలింది. ఒక్కసారిగా కూలి ఆడుకుంటున్న విద్యార్థిపై పడింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ .. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
కాగా గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కేఎన్ఆర్ ప్రభుత్వ స్కూల్లో సన్ సైడ్ నిర్మించారు. ఈ స్కూల్ జహా జిల్లాలో చాలా బడుల్లో నాడు-నేడు పనులు, నాసిరకంగా జరిగినట్లు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందించినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతితో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ అసమర్థత, అవినీతి వల్లే స్కూల్లో విద్యార్థి చనిపోయారని ఆరోపణలు చేస్తున్నారు. సైకో జగన్ నాడు-నేడు పనులు విద్యార్థులను చంపేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.