Breaking: చీరాలలో వ్యక్తి దారుణ హత్య

by srinivas |   ( Updated:2024-06-23 17:15:18.0  )
Breaking: చీరాలలో వ్యక్తి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాలలో దారుణం జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా కర్రీస్ పాయింట్ నిర్వహిస్తున్న కంచర్ల సంతోష్‌కు, ఎదురుగా ఉన్న అరటి పండ్ల దుకాణం వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కంచర్ల సంతోష్(35)పై అరటి కాయలు కోసే కత్తితో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో సంతోష్‌ తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయారు. వెంటనే 108 ద్వారా చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే మార్గమధ్యంలో సంతోష్ మృతి చెందారు. ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed