- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెయిలా? జైలా?: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు చంద్రబాబు పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే ధర్మాసనం శుక్రవారం మద్యాహ్నాం కూడా విచారణ చేపట్టనుంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మనుసంఘ్వీ వాదనలు వినిపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో వాదనలు అంతా అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ చుట్టూనే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 17ఏ వర్తిస్తుందని హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే సెక్షన్ 17ఏ చంద్రబాబుకు ససేమిరా వర్తించదని న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సెక్షన్ 17ఏ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
హాట్ టాపిక్‌గా మారిన 17A సెక్షన్
‘సెక్షన్ 17A చంద్రబాబుకు తప్పకుండా వర్తిస్తుంది.. చట్టం దుర్వినియోగం కావొద్దనే 17Aను తీసుకొచ్చారు. రాజకీయ ప్రతీకార చర్యగానే చంద్రబాబును అరెస్ట్ చేశారు’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. ఎఫ్ఐఆర్ నమోదైన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని.. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2019లో ఓ కేసు కొట్టేశారని గుర్తు చేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు దర్యాప్తు జరిపే హక్కు లేదని హరీశ్ సాల్వే వాదించారు. దర్యాప్తు అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని అన్ని రకాల విధుల్లో సెక్షన్ 17Aతో రక్షణ ఉంటుందన్నది చంద్రబాబు తరపున సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ సైతం కౌంటర్‌గా వాదనలు వినిపించారు. సెక్షన్ 17A ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అవినీతికి పాల్పడేవారికి 17A అండగా ఉండొద్దని.. అసలీ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా చూడొద్దని సుప్రీంకోర్టు ద్విసభ్యధర్మాసనాన్ని కోరారు. 2018కి ముందు కొంత వరకు విచారణ జరిగిందని.. ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును ఎప్పుడు ఎఫ్ఐఆర్‌లో చేర్చినా.. విచారణ కొనసాగుతున్నట్టుగానే పరిగణించాలని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట సెక్షన్ 17Aపై ఇప్పటికే 3 సార్లు బెంచ్ ముందు పోటాపోటీ వాదనలు జరిగాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.