అప్పటి వరకూ బయటకు రావొద్దు.. కూటమి ఏజెంట్లకు చంద్రబాబు కీలక సూచన

by srinivas |   ( Updated:2024-06-03 16:42:48.0  )
అప్పటి వరకూ బయటకు రావొద్దు.. కూటమి ఏజెంట్లకు చంద్రబాబు కీలక సూచన
X

దిశ, వెబ్ బెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తమయ్యారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో పార్టీ తరపున పని చేసే ఏజెంట్లతో ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్రాలను వెళ్లాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయే వరకూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని తెలిపారు. పోల్ అయిన ఓట్లు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రౌండ్లు పూర్తి అయినా ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్లను లెక్కిస్తారని, ఏ అనుమానం వచ్చినా ఆర్వోకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుకు సంబంధించి ఎకనాలెడ్జ్‌మెంట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అనుమానాలు, అభ్యంతరాలపై అధికారులు తెలపాలన్నారు. అనారోగ్యకారణాలతో ఏజెంట్ కౌంటింగ్‌కు వెళ్లలేకపోతే అంతకుముందే మరొకరిని పంపించాలని చంద్రబాబు కోరారు.

Advertisement

Next Story