ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు.. ట్రస్ట్ సీఈవో కీలక ప్రకటన

by srinivas |   ( Updated:2024-05-24 12:10:32.0  )
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు.. ట్రస్ట్ సీఈవో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కొనసాగుతోంది. ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని స్పెషాలిటీ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్య శ్రీ ట్రస్ట్ రూ. 203 కోట్లు విడుదల చేసింది. కానీ రూ. 800 కోట్లు విడుదల చేయాలని ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌తో రెండు సార్లు జరిపిన చర్చలు విఫలవడంతో బంద్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో కీలక ప్రకటన చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్యం అందుబాటులో ఉందని, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు అంతరాయం కలిగించొద్దని ఆస్పత్రుల యజమానులకు పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఈవో స్పష్టం చేశారు. రెండు రోజులుగా 13, 836 మంది ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు పొందారని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సారానికి రూ. 3,566 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు నెలలకు రూ. 366 కోట్లు నెట్ వర్క్ ఆస్పత్రులకు జమ చేశామని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో వెల్లడించారు.

Read More..

ఆ ప్రక్రియను వాయిదా వేయండి.. యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ

Advertisement

Next Story