- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking:ముచ్చటగా మూడోసారి మారిన వైసీపీ అరకు ఇంఛార్జ్.. కారణం ఇదే
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మార్పులు చేర్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక అభ్యర్థుల నియామకంలో ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ నిన్న 5 వ జాబితాను కూడా విడుదల చేసింది.
ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం, 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులను చేసింది. ఈ నేపథ్యంలో అరకు కో-ఆర్డినేటర్ ను మళ్ళీ మార్చేసింది. గతంలో అరకు ఇంచార్జ్ గా మాధవిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కాగా మాధవి ఇంచార్జ్ గా నియమితురాలు అయిన తరువాత స్థానికంగా లోకల్.. నాన్ లోకల్ రచ్చ మొదలైంది.
ఇక ఈ స్థానికత వివాదం తార స్థాయికి చేరడంతో కొంత కాలంగా అరకు వైసీపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ముద్దు.. మాధవి వద్దనే నినాదం కేడర్ లోకి బలంగా వెళ్లిపోయింది. దీనితో పునరాలోచనలో పడిన వైసీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించిన ఎంపీ మాధవి స్థానంలో రేగం మత్స్య లింగంను నియమించింది.
కాగా మత్స్య లింగం టీచర్ వృత్తిని వదిలి 2018లో వైసీపీలో చేరారు. ప్రస్తుతం హుకుంపేట జడ్పీటీసీగా ఉన్న ఆయన, గిరిజన ఉపాధ్యాయుల సంఘంతో పాటు ఆదివాసీ సంఘాలతో సత్సంబంధాలను కలిగిన నేతగా మంచి గుర్తింపు కలిగివున్నారు.